“అమృతం 2” సీరియల్ లో అందరి కళ్ళు అతని వైపే.!

Saturday, February 22nd, 2020, 10:58:59 AM IST

మన తెలుగు బుల్లి తెర చరిత్రలో ఎవరు గ్రీన్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ సీరియల్ ఏది అంటే అది ఖచ్చితంగా “అమృతం” సీరియల్ అని చెప్పాలి.నిర్విరామంగా ఏడేళ్ల పాటు చక్కటి వినోదాన్ని పంచిన ఈ ధారావాహిక ఆగిపోవడంతో మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చాలా మిస్సవుతున్నారు.అయితే గతంలో టెలికాస్ట్ కాబడిన ఎపిసోడ్స్ అన్నిటిని యూట్యూబ్ లో పెట్టగా వాటికి ఇప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.

కాకపోతే ఈ మధ్యనే ఈ సీరియల్ తాలూకా అన్ని ఎపిసోడ్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ “జీ5” వారు కొనుగోలు చేసేసారు.దీనితో ఇక నుంచి ఈ సీరియల్ జీ5 లోనే అందుబాటులోకి ఉండబోతుంది అని ఖరారు అయ్యిపోయింది.కానీ ఇపుడు అమృతం సీరియల్ లవర్స్ కు “అమృతం 2” మొదలు కాబోతుందన్న వార్త విన్నాక ఏదో చెప్పలేని ఆనందం మొదలయ్యింది.

అలాగే ఈ పాత సీరియల్ లోని ప్రధాన పాత్రధారులలో ఒకరైన గుండు హనుమంతురావు గారి పాత్ర కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదల్యయింది.ఈ సీరియల్ లో “ఆంజనేయులు”గా గుండు హనుమంతురావు పోషించిన పాత్ర ఎవ్వరూ మరువలేనిది కానీ ఇప్పుడు ఈ స్థానాన్ని టాలీవుడ్ ప్రముఖ సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ గారు పోషిస్తున్నారు.ఈ షూటింగ్ తాలూకా ఫోటోలు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో బయటకు కూడా వస్తున్నాయి.

అయితే ఈయన ఆ పాత్రలో ఎలా కనిపించనున్నారని పూర్తి స్థాయి న్యాయం చేస్తారా చెయ్యరా అని కొందరు అంటుండగా మరికొందరు ఎల్ బి శ్రీరామ్ గారిని తక్కువ అంచనా వెయ్యడానికి లేదని ఆయన టైమింగ్ ఏపాటిదో కొన్ని పాత సినిమాలను చూస్తే మనకి అర్ధం అవుతుంది.ఈ మధ్య అంటే ఇలాంటి నటులకు తగ్గ కామెడీను నేటితరం దర్శకులు రాసుకోలేకపోతున్నారు తప్ప ఈ సీరియల్ లో మాత్రం అంజనేయులు పాత్రలో శ్రీరామ్ గారు తప్పకుండ సరిపోతారని చెప్పాలి.ఈ “అమృతం” రెండో సీజన్ ప్రీమియర్స్ జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో మార్చ్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి.