గెట్ రెడీ : కింగ్ నాగ్ ప్రోమోకు సర్వం సిద్ధం..!

Saturday, August 1st, 2020, 08:56:31 AM IST

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 4 కు ఇప్పుడు అంతా రెడి అవుతుంది. గత సీజన్ ను అద్భుతంగా రక్తి కట్టించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ కు మరోసారి హోస్ట్ గా కనపడడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పటికే షో ఉందని అధికారిక ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా వారు ఇప్పుడు కింగ్ నాగార్జున కు సంబంధించి ప్రోమోను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి చాలా జాగ్రత్తలతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రోమో షూట్ నిర్వహించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రోమో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. మరి ఈసారి నాగార్జున ఎలా హోస్ట్ చేస్తారో చూడాలి.