వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టైలిష్ స్టార్ సినిమా.!

Wednesday, July 15th, 2020, 03:46:44 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ 2020లో సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అలాగే ఆ తర్వాత డిజిటల్ గా కూడా విడుదలై భారీ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అయితే అదే సమయంలో ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేస్తామని ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు ప్రకటించారు. కానీ అప్పుడు సరైన సమయం కుదరక ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్లీ అందుకు టైం వచ్చినట్టు తెలుస్తుంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రం జెమినీ టీవీలో అతి త్వరలోనే టెలికాస్ట్ కు రెడి అవుతున్నట్టు ఇపుడు సమాచారం. ఈ సినిమా ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో కానీ ఈ చిత్రానికి కూడా తెలుగు ఆడియన్స్ భారీ టీఆర్పీ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి.