యూట్యూబ్ లో దుమ్ము రేపిన అఖిల్ డిజాస్టర్ చిత్రం.!

Wednesday, August 5th, 2020, 12:23:15 PM IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో యువ హీరో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ ఇప్పటి వరకు హీరోగా మొత్తం మూడు సినిమాలు చేసినా వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ తాను నటిస్తున్న నాలుగో సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” సినిమాకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే తాను చివరగా నటించిన “మిస్టర్ మజ్ను” చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిపోయింది. కానీ ఈ సినిమా మాత్రం హిందీలో మాత్రం దుమ్ము రేపింది. యూట్యూబ్ లో పెట్టిన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయి మిలియన్ వ్యూస్ అందుకొని మరోసారి మన తెలుగు సినిమాల సత్తా చాటింది.

లైక్స్ మరియు వ్యూస్ పరంగా మన తెలుగు నుంచి ఏ సినిమా కూడా అందుకోని ఫాస్టెస్ట్ రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను టచ్ చేసింది. కేవలం నెల రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని రికార్డు సాధించింది. గత జులై 4 న యూట్యూబ్ లో ఈ చిత్రాన్ని పెట్టగా నేటికీ సరిగ్గా నెలలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది.