“పవర్ స్టార్” తర్వాత ఆ రేంజ్ రచ్చ లేపుతున్న “మర్డర్”.!

Thursday, July 30th, 2020, 12:28:31 PM IST

టాలీవుడ్ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ లో కూడా పలు సినిమాలు తీసి సంచలనం రేపాడు. పైగా వాటిని ఆర్జీవీ వరల్డ్ అనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాల్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిన సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అది “పవర్ స్టార్” మొదటగా ఉంటుంది అని చెప్పాలి.

అలాగే దీనితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన అమృత ప్రణయ్ హత్య ఘటనను ఆధారంగా చేసుకొని ఆమె తండ్రిపై “మర్డర్” అనే సినిమాను ప్రకటించి సంచలనమే రేపాడు. దీనితో ఈ సినిమా ఒక్కసారి హాట్ టాపిక్ అవ్వగా ఇది కూడా పవర్ స్టార్ లానే సంచలనాలు రేపుతోంది.

పవర్ స్టార్ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే లక్షల కొద్దీ వ్యూస్ తో పాటుగా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంకు వచ్చి ట్రెండ్ అయ్యింది. అలా ఇప్పుడు మర్డర్ ట్రైలర్ కూడా రచ్చ లేపుతుంది. రెండు రోజులు అయినప్పటికీ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఈ రెండు సినిమాలు భారీ ఇంపాక్ట్ ను కలిగించాయి అని చెప్పాలి.