స్టార్ మాలో దసరా బొమ్మల కొలువు.. 9 రోజులు 9 బ్లాక్‌బస్టర్స్..!

Saturday, October 17th, 2020, 01:10:29 AM IST

ఈ దసరాకు స్టార్ మా ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్దమయ్యింది. దసరా నవరాత్రుల సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా తొమ్మిది బ్లాక్ బస్టర్ సినిమాలతో మిమ్మల్ని కనువిందు చేయబోతుంది. ఈ నెల 17 నుంచి 25 వరకు ప్రతి రోజు మధ్యాహ్నాం 12 గంటలకు ఈ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. అయితే ఎంసీఏ, జాను, రాజుగారిగది-3, జులాయి, విశ్వాసం, జెండాపైకపిరాజు, మిర్చి, ఖైదీ, పోలీసోడు వంటి బిగ్గెస్ట్ సినిమాలతో మీ ఇంట్లో ఈ పండగంతా సందడే సందడిగా మారబోతుంది.