ఎయిర్ టెల్ 4జీ అమ్మాయి గురించి మీకు తెలుసా..?

Monday, February 22nd, 2016, 01:18:13 PM IST

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాడ్ ‘ఎయిర్ టెల్ 4జీ’. ఈ యాడ్ అంతగా హిట్ అవ్వడానికి అందులో కనిపించే అమ్మాయే ప్రధాన కారణం. ఈ యాడ్ రావడానికి ముందు ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాడ్ ద్వారానే ఆ అమ్మాయి ప్రపంచానికి పరిచయమైంది. ఈ యాడ్ చూసిన జానాలకంతా అసలేవరీ అమ్మాయి. పేరు కూడా తెలీదే. ఇంతకుముందెప్పుడూ ఏ యాడ్ లోనూ చూడలేదే అనుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకోవాలని నెట్ లో తెగ వెతికేశారు. అంతగా ఆలోచింపజేసింది ఈ అమ్మాయి అందరినీ. అందుకే ఆ అమ్మాయిని గురించిన విశేషాలు మీకోసం.

 

* ఈ 19 ఏళ్ళ అమ్మాయి అసలు పేరు సాషా ఛత్రి.
* పుట్టింది డెహ్రాడూన్ లో. ఉన్నత చదువుల కోసం 16 ఏళ్ళ వయసులో ముంబై వచ్చిన ఈమె తన గ్రాడ్యుయేష ను గ్సావియర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ లో పూర్తి చేసుకుంది.
* చదువు తరువాత కొంతకాలం కాపీ రైటర్ గా పనిచేసిన ఈమె సంగీతం పై ఇష్టంతో పాడటం, మ్యూజిక్ కంపోజ్ చెయ్యడం వంటివి నేర్చుకుని రిక్షా రాణిగా పేరు తెచ్చుకుంది.
* తరువాత మోడలింగ్ రంగంలో రాణించాలని ముంబైలోని అన్ని యాడ్ ఏజెన్సీలకు తన ఫోటోలను పంపి అవకాశాల కోసం ఎదురుచూసింది.

* అనుకోకుండా ఒకరోజు ముంబైలోని పాపులర్ యాడ్ ఏజెన్సీ తప్రూట్ ఇండియా యాడ్ ఏజెన్సీ నుంచి కాల్ అందుకుని అక్కడకు వెళ్ళింది.
* ఆ యాడ్ ఏజెన్సీ యజమాని తప్రూట్ డెన్ట్సు ఎయిర్ టెల్ యాడ్ లో నటించాలని చెప్పి ఆమెను ఆ యాడ్ దర్శకుడైన రామ్ మాధవానికి పరిచయం చేశాడు. రామ్ మాధవాని ఫైనల్ గా సాషా ఛత్రినే సెలెక్ట్ చేశాడు.
* ఈ సిరీస్ లో వచ్చిన మొట్టమొదటి యాడ్ తోనే సాషా ప్రజలకు బాగా నోటెడై.. పాపులరైంది.
* 2015 లో వచ్చిన అన్ని ఎయిర్ టెల్ 4జీ యాడ్లలోనూ కలిపి సాషా 1,708,586 సెకన్లు కనిపించింది. అంటే దాదాపు ఆమె 20 రోజుల పాటు స్క్రీన్స్ పై కనిపించిందన్నమాట.
* ప్రస్తుతం సాషా ఓ ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ను రూపొందించే పనిలో ఉంది.