శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ నుండి ఔట్…మరి ఐపియల్ లో?

Thursday, March 25th, 2021, 08:33:23 AM IST

శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు టీమ్ ఇండియా లో కీలక ఆటగాడి గా మారిపోయారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్ నుండి ఇక ఔట్ అంటూ అందరూ చెప్పుకొస్తున్నారు. గాయం నుండి కోలుకోవడానికి కనీసం ఆరు వారాలు పడుతుంది అని అంటున్నారు. అయితే సర్జరీ కూడా అవసరం అంటూ పలువురు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే రానున్న ఐపియల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. శ్రేయాస్ అయ్యర్ సారథ్యం లో లాస్ట్ ఐపియల్ సీజన్ లో ఢిల్లీ ఫైనల్స్ కి చేరింది. జట్టును నడిపించడం లో అయ్యర్ కీలక పాత్ర పోషించారు. అంతేకాక మునుపటి కంటే కూడా జట్టు ప్రదర్శన బాగుంది అని చెప్పాలి. అయితే వన్డే సిరీస్ లో అయ్యర్ స్థానం లో తుది జట్టులో సూర్య కుమార్ లేదా గిల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే శ్రేయాస్ అయ్యర్ ఇక ఐపియల్ కు కూడా దూరం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ ఎవరు అంటూ పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి. అయితే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ ఢిల్లీ కి కెప్టన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదా సీనియర్ స్పిన్నర్ రవచంద్రన్ అశ్విన్ కూడా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాక ఆస్ట్రేలియా కి చెందిన స్టీవ్ స్మిత్ కూడా ఈ ఐపియల్ లో అందుబాటు లో ఉండనున్నారు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.