మరో బౌన్సర్ దెబ్బ: షాక్ తిన్న ఆసిస్ ఆటగాళ్ళు

Tuesday, December 23rd, 2014, 02:55:04 PM IST

whatsan
ఇటీవల ఆస్ట్రేలియాలో బౌన్సర్ దెబ్బకు మైనానంలో కుప్పకూలి అనంతరం చికిత్స పొందుతూ మరణించిన ఫిలిప్ హ్యూస్ విషాద గాధ మరువక ముందే అలాంటి సంఘటనే ఆసిస్ ఆటగాళ్లకు మరో సారి ఎదురైంది. అయితే ఈ సారి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు ఇలాంటి బౌన్సర్ పెను ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే మెల్ బోర్న్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్ వాట్సన్ తలకు గట్టిగా తగిలింది.

దీనితో వాట్సన్ మైదానంలో హెల్మెట్ ను పక్కన పడేసి తలను రెండు చేతులతో పట్టుకుని బాధతో విలవిలలాడాడు. అటుపై వైద్య పరీక్ష అనంతరం వాట్సన్ ప్రాక్టీస్ నుండి తప్పుకున్నాడు. ఇక ఈ ఘటనతో ప్యాటిన్సన్ కూడా తీవ్ర షాక్ కి గురైనాడు. ఇక తాజాగా హ్యూస్ మరణంతోనే విషాదంలో మునిగిపోయిన ఆసిస్ ఆటగాళ్ళు వాట్సన్ కు అదే రీతిలో దెబ్బ తగలడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా వాట్సన్ కు పెద్ద ప్రమాదం తప్పినట్లు ఆసిస్ ఆటగాళ్ళు పేర్కొన్నారు.