థర్డ్ అంపైర్ తప్పిదం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్..!

Friday, March 19th, 2021, 03:00:09 AM IST


భారత్-ఇంగ్లండ్ మధ్య ఎంతో ఉత్కంఠగా జరిగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 177 పరుగులే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ చేసిన ఓ తప్పిదం తీవ్ర వివాదస్పదమవుతుంది.

ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (57; 31 బంతుల్లో 6క్ష్4, 3క్ష్6) సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మలాన్ పట్టిన క్యాచ్‌ బంతి నేలను తాకినట్టు క్లియర్‌గా కనిపించింది. అయిన థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ అవుట్‌గా ప్రకటించాడు. వివాదాస్పద నిర్ణయం ప్రకటించిన థర్డ్ అంపైర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. కళ్లకు గంతలు కట్టుకుని అంపైర్ నిర్ణయం ఇచ్చినట్టుగా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై దినేశ్ కార్తిక్ కూడా స్పందిస్తూ ఫన్నీ ట్వీట్ ఒకటి చేశాడు. బుల్లెట్‌పై సూర్య, విరాట్, రోహిత్ కలిసి థర్డ్ అంపైర్‌ని కొట్టేందుకు వెళ్తున్నట్టు ఉన్న మీమ్ ను పోస్ట్ చేశాడు. అంతేకాదు క్రికెట్‌లో అంపైర్ జాబ్ చాలా కష్టమని ఎలాగో భారత్ గెలిచింది కాబట్టి అతడిని కాస్త మందలించండి అని చెప్పుకొచ్చాడు.