మారిన ఐపీఎల్ తేదీలు – కొత్త షెడ్యూల్ ఖరారు… అంతా కరోనా మాయ…

Friday, March 13th, 2020, 03:26:01 PM IST

ప్రపంచం అంతా కూడా వైరస్ కారణంగా తీవమైన భయాందోళనకు గురవుతుంది. ఈ కరోనా కారణంగా తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ఆటను ఈ నెలలో ప్రారంభించాడని సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఈ ఐపీఎల్ ని ప్రస్తుతానికి రద్దు చేయమని కోర్టులో కేసు కూడా వేశారు కొందరు ప్రముఖులు. ఈ తరుణంలోనే ఐపీఎల్ ఇప్పుడు వాయిదా పడింది. దానికి తోడు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఐపీఎల్ ని నిర్వహించబోమని స్పష్టం చేశారు.

ఈ మేరకు కేంద్ర సూచనా మేరకు బీసీసీఐ ఈ ఐపీఎల్ – 13 ని కొన్ని రోజులు వాయిదా వేసింది. కాగా మార్చి 29 న ప్రసారం కావాల్సిన ఈ మ్యాచులు వచ్చే నెల అంటే ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవనున్నాయి… తొలి మ్యాచ్ ఏప్రిల్ 15న రాత్రి 8 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుందని సమాచారం. అయితే ఈ విషయంలో కాస్త సందిగ్దత కూడా నెలకొంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.