క్రిక్ బజ్ మరియు క్రిక్ ఇన్ఫో లకు భారీ దెబ్బేసిన కరోనా…ఐపీఎల్ ను నమ్ముకుంటే పరిస్థితి ఇది!

Wednesday, May 27th, 2020, 02:41:05 PM IST


అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికే ఐపీఎల్ ను అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేసేవారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఇంకా ఐపీఎల్ ను నిర్వహించ లేదు. గుంపులు గుంపులు గా ఉండుట వలన, భౌతిక దూరం పాటించక పోవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి అధికం అయ్యే అవకాశాలు ఉండటం తో ఈ ఏడాది ఐపీఎల్ జరగలేదు. అయితే క్రికెట్ ను నమ్ముకొని ఉన్న కొన్ని వెబ్సైట్ లకు మాత్రం భారీ దెబ్బ పడింది అని చెప్పాలి.

క్రికెట్ గురించి ప్రతిక్షణం అన్వేషిస్తూ, ఎన్నో అప్డేట్ లను ఇచ్చే క్రిక్ ఇన్ఫో మరియు క్రిక్ బజ్ వెబ్స్తిట్ లకు భారీగా నష్టం వాటిల్లింది అని చెప్పాలి. ఐపీఎల్ సీజన్ టైమ్ లో ట్రాఫిక్ భారీగా వస్తుందని భావించారు. జనవరి నెలలో క్రిక్ బజ్ 265.5 మిలియన్ ట్రాఫిక్ ను సాధించగా, ఏప్రిల్ నెలకు గానూ కేవలం 16.2 మిలియన్ ట్రాఫిక్ ను సాధించింది. అలానే క్రిక్ ఇన్ఫో జనవరి నెలలో 92.6 మిలియన్ ట్రాఫిక్ సాధించగా, ఏప్రిల్ నెలలో 17.7 మిలియన్ ట్రాఫిక్ ను సాధించింది. అయితే ప్రముఖంగా ఉన్న వీటికే భారీ గా కరోనా దెబ్బే య్యాడంతో మిగతా స్పోర్ట్స్ నే నమ్ముకున్న వెబ్ సైట్ లకు భారీగా నష్టం తప్పదు అని తెలుస్తోంది.