టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫోటో వైరల్.. నెటిజన్లు ఫిదా..!

Friday, March 13th, 2020, 12:48:24 AM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పక్క తన కుమారుడు ఇజహాన్‌ను ఎత్తుకుని మరో చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. నా జీవితం ఒకే చిత్రంలో. నాకు మరో దారి లేదు. నా పని నేను నిర్వహించడానికి నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు అని రాసింది.

అయితే ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అటు తల్లిగా బిడ్డ సంరక్షణతో పాటు ఇటు టెన్నిస్ కూడా సమన్వయం చేస్తున్నావంటూ సోనియాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. మార్చి 8న దుబాయ్‌లో జరగనున్న ఫెడ్‌ కప్‌ టోర్నీ సందర్భంగా తన కొడుకు ఇజహాన్‌ను సానియా దుబాయ్‌ తీసుకెళ్ళింది. ఇదిలా ఉంటే సానియా 2010లో పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.