317 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన భారత్

Tuesday, February 16th, 2021, 12:59:20 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో టీమ్ ఇండియా తన సత్తా మరొకసారి చాటింది. చెపాక్ వేదిక గా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ ఆల్ రౌండ్ ప్రదర్శన తో టీమ్ ఇండియా విజయం సాధించింది అని చెప్పాలి. 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 164 పరుగులకు కుప్పకూలింది. అక్షర్ 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే టీమ్ ఇండియా బౌలర్లు తమ సత్తా చాటడం తో 317 పరుగులు భారీ తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.