బాక్సింగ్ డే టెస్ట్: 8 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం

Tuesday, December 29th, 2020, 10:11:56 AM IST

ఆస్ట్రేలియా తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. మొదటి పింక్ టెస్ట్ మ్యాచ్ లో ఘోర ఓటమి చవి చూసిన భారత్. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి, సీరీస్ ను 1-1 తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 70 పరుగులు నిర్దేశించగా, భారత్ రెండు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. రహానే 27 పరుగులు, శుభమన్ గిల్ 35 పరుగులు చేయడం తో ఈ విజయం సాధ్యం అయింది అని చెప్పాలి. అయితే ఓపెనర్లు గా వచ్చిన మాయాంక్ అగర్వాల్ మరియు పుజారా మరొకసారి నిరాశ పరచడం తో టీమ్ ఇండియా కాస్త ఆందోళన చెందింది. అయితే రహానే మరియు గిల్ అద్భుత బ్యాటింగ్ తో చివర్లో గెలుపు సాధ్యం అయింది.