అదరగొడుతున్న టీమిండియా…జోరు కొనసాగించినా?

Friday, January 10th, 2020, 07:54:35 PM IST

శ్రీలంక తో జరుగుతున్నా మూడవ టీ 20 మ్యాచ్ రసవత్తరంగా మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక భారత బ్యాట్స్ మెన్ ని అడ్డుకొనేందుకు కష్టపడుతుంది. అయితే భారత ఓపెనర్లు తొలి ఓవర్ నుండి దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నారు. అయితే 10.2 ఓవర్లు ముగిసే సరికి భారత్ 94 పరుగులు చేసింది. రాహుల్, శిఖర్ ధావన్ లు క్రీజులో అత్యద్భుతంగా రాణిస్తున్నారు.

మొదటి మ్యాచ్ వర్షం కారణం గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండవ మ్యాచ్ లో భారత్ దూకుడు ప్రదర్శించి శ్రీలంక ఫై గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ గెలుపు కోసం ఇరు జట్టులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. మరి భారత్ దూకుడుని శ్రీలంక అడ్డుకుంటుందా? తెలియాలంటే వేచి చూడాలి.