తొలి టీ-20లో తడబడిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ 125..!

Friday, March 12th, 2021, 09:05:38 PM IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తడబడింది. ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0), ధావన్(4) నిరాశపరిచారు. రిషబ్ పంత్(21), హార్దిక్ పాండ్య(19) పర్వాలేదనిపించారు.

అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ 67 పరుగులతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ముందు 125 పరుగుల స్వల్ఫ లక్ష్యం ఉంది. మరి ఈ స్వల్ఫ స్కోరును టీమిండియా బౌలర్లు డిఫెండ్ చేయగలుగుతారో లేదో చూడాలి మరీ.