రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫేసర్ అశోక్ దిండా..!

Wednesday, February 3rd, 2021, 02:15:01 AM IST


టీమిండియా ఫేసర్ అశోక్ దిండా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అశోక్ దిండా, 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. 36 ఏళ్ల దిండా కెరీర్‌లో మొత్తం 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. 2009లో ప్రారంభమైన దిండా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ 2013లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో చివరగా ఆడాడు.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో దిండాకు అంతగా అవకాశాలు రానప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే 2019లో రంజీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దిండాను పక్కన పెట్టేసింది. అయితే 2005 నుంచి 2019 వరకు దిండా మొత్తం 420 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కత్తా, పుణె, ఢిల్లీ, ఆర్సీబీ జట్ల తరపున ఆడాడు.