ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డ్..!

Wednesday, May 5th, 2021, 09:44:05 PM IST

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్ద్ సాధించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో రిషబ్ పంత్ ఆరో స్థానం సంపాదించాడు. గతేడాది ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో రిషబ్ పంత్ సత్తా చాటడంతో 747 పాయింట్లతో ఆరో స్థానంలోకి దూసుకెళ్లాడు. అయితే తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్న టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతొ ఐదో స్థానంలో ఉండగా, రోహిత్‌ శర్మ 747 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆల్‌రౌండర్లలో జడేజా 3, అశ్విన్ 4 స్థానంలో నిలిచారు.