రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ నమన్ ఓఝా..!

Tuesday, February 16th, 2021, 12:04:38 AM IST


భారత వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ నమన్ ఓఝా తాజాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ళ ఓజా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జింబాబ్వే టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున ఆడాడు.

అయితే తాజాగా ఓఝా రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ సహా జూనియర్ కాంపిటిషన్లు ఎన్నింటిలోనో 20 ఏళ్లపాటు ఆడానని ఇక తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఇది నా జీవితంలో చాలా సుదర్ఘమైన, అద్భుతమైన దశ అని చెప్పుకొచ్చాడు. ఇన్ని రోజులు తనకు అండగా నిలిచిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ఓఝా ధన్యవాదాలు తెలియచేశాడు.