వన్డేల్లో కోహ్లీ మరో నయా రికార్డ్

Wednesday, December 2nd, 2020, 12:02:12 PM IST

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో మరొక మైలు రాయిని చేరుకున్నారు. ఇప్పటికే తన బ్యాటింగ్ తో విమర్శకుల తో ప్రశంసలు పొందుతున్న ఈ రన్నింగ్ మిషన్ వన్డేల్లో మరొక నయా రికార్డ్ క్రియేట్ చేసారు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల కెక్కాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ 12 వేల పరుగులు చేయడానికి 242 ఇన్నింగ్స్ మాత్రమే ఆడటం గమనార్హం. కెరీర్ లో 251 మ్యాచ్ లు ఆడిన విరాట్, 242 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇదే 12 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడానికి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కి 300 ఇన్నింగ్స్ కావాల్సి వచ్చింది.

అదే విధంగా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 22 వేల పరుగులు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సచిన్ 493 ఇన్నింగ్స్ లో 22 వేల పరుగులు సాధించిగా, కోహ్లీ 462 ఇన్నింగ్స్ తో రికార్డ్ నెలకొల్పాడు. అయితే వన్డేల్లో కోహ్లీ తర్వాత 12 వేలు పరుగులు సాధించిన లిస్ట్ లో సచిన్ 300 ఇన్నింగ్స్ తో రెండవ స్థానం లో ఉందగా, రికీ పాంటింగ్ 314 ఇన్నింగ్స్, ఆ తర్వాత కుమార సంగక్కర, సనత్ జయసూర్య, జయ వర్దనే లు వరుస క్రమం లో ఉన్నారు.