సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కత్..!

Thursday, February 4th, 2021, 12:02:52 AM IST


భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కత్ మంగళవారం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలో రిన్నీ కంటారియాను ఉనాద్కత్ పెళ్లాడాడు. రిన్నీ వృత్తి రీత్యా న్యాయవాది. ఈ సందర్భంగా రిన్నీతో కలిసి దిగిన ఫోటోతో పాటు ఓ లేఖను ట్విట్టర్ ద్వార పోస్ట్ చేసి తన పెళ్ళి విషయాన్ని ఉనాద్కత్ అభిమానులతో పంచుకున్నాడు.

అయితే మా వివాహం ఫిబ్రవరి 2న కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో జరిగిందని, ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని, మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ మేం ప్రారంభించిన ఈ అద్భుతమైన కొత్త ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలని ఉనాద్కత్ లేఖలో పేర్కొన్నారు. లెఫ్ట్‌ఆర్మ్ మీడియం ఫేసర్ అయిన ఉనాద్కత్ భారత్ తరఫున టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున ఆడుతున్నాడు.