చెన్నై జట్టుకు మరో షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా..!

Saturday, August 29th, 2020, 01:30:32 PM IST

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ యూఏఈలో జరపాలని నిశ్చయించడంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని క్వారంటైన్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. వచ్చే నెల 19 వ తేది నుంచి ఈ సీజన్ మొదలుకాబోతుంది. అయితే ఇంకా టోర్నీ ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది.

నిన్న చెన్నై జట్టులోని ఒక పేసర్, 12 మంది సపోర్ట్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఈ సమయంలో మేము రైనాకు, అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తాము అని ట్వీట్ చేసింది.