ఢిల్లీపై సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. వార్నర్‌కి రియల్ బర్త్‌డే ట్రీట్..!

Tuesday, October 27th, 2020, 11:36:40 PM IST


ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీపై సన్‌రైజర్స్ 88 పరుగుల భారీ తేడాతో గెలిచి వార్నర్‌కి రియల్ బర్త్‌డే ట్రీట్ అందించింది. తొలుత టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్ మోదలుపెట్టింది. ఓపెనర్లు వార్నర్‌ 66 పరుగులు, వృద్ధిమాన్‌ సాహా 87 పరుగులు, మనీష్‌ పాండే 44 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సన్‌రైజర్స్ 219 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫాంలో ఉన్న శిఖర్ ధావన్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. అయితే రిషబ్ పంత్‌ నిలకడగా ఆడి 36 పరుగులు చేసినా మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ చేతులెత్తేయడంతో 19 ఓవర్లలో కేవల 131 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అయితే ఈ గెలుపుతో సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది.