ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ 56 పరుగులు, అరోన్ ఫించ్ 32 పరుగులతో రాణించగా, మిగతా వారు పెద్దగా స్కోర్ చేయలేకపోయారు.
అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండేతో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత ఆరో ఓవరలో వార్నర్ ఔట్ కావడం, వెంటనే మనీష్ పాండే, ప్రీయం గార్గ్ కూడా ఔట్ కావడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే కేన్ విలియమ్సన్ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం కాకుండా, హోల్డర్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే 132 పరుగుల లక్ష్యాన్ని4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించిన సన్‌రైజర్స్ క్యాలిఫైయర్ 2లోకి అడుగుపెట్టింది. ఈ నెల 8వ తేదిన క్వాలిఫైయర్ 2లో సన్‌రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తడపడనుంది.