డూ ఆర్ డై మ్యాచ్: రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ ఘన విజయం..!

Thursday, October 22nd, 2020, 11:35:25 PM IST

నేడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మనీష్ పాండే 83 పరుగులు, విజయ్ శంకర్ 51 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 36 పరుగులు, బెన్ స్టోక్స్ 30 పరుగులు, రియాన్ పరాగ్ 20 పరుగులు, స్మిత్ 19 పరుగులు, ఊతప్ప 19 పరుగులు మాత్రమే చేయడంతో రాజస్థాన్ జట్టు తక్కువ స్కోరే చేయగలిగింది.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు మొదట్లోనే వార్నర్, బెయిర్ స్టో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుపై కాస్త ప్రెజర్ కనిపించింది. ఆ తర్వాత మనీశ్, విజయ శంకర్ అద్భుతమైన పార్ట్‌నర్ షిప్‌ నెలకొల్పడం, ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి నాటౌట్‌గా నిలవడంతో 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సన్‌రైజర్స్ జట్టు విజయం సాధించింది.