రిషబ్ పంత్ పై సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం

Thursday, May 13th, 2021, 12:30:26 PM IST

టీమ్ ఇండియా యువ ఆటగాళ్ళు అందరూ కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూ అవకాశాలను చేజిక్కించుకున్నారు. అయితే తాజాగా టీమ్ ఇండియా క్రికెట్ లో కీలక ఆటగాడి గా మారిపోయాడు రిషబ్ పంత్. అయితే తన ఆటతీరు పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రిషబ్ పంత్ ఆటతీరు పట్ల ప్రశంసల వర్షం కురిపించారు.

యువ రిశబ్ సారథ్యం లో ఢిల్లీ నిలబడింది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచ్ కే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ తర్వాత అతన్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే చూసోచ్చెందుకు అనుమతిస్తే కాల్చోచ్చెందుకు సిద్దంగా ఉంటాను అన్న జ్వాలను అతను ప్రదర్శించాడు అని అన్నారు.అయితే సారథిగా కొన్ని తప్పులు చేశాడు అని అన్నారు. కానీ, పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు అంటూ చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్. అయితే పొరపాట్ల నుండి నేర్చుకొనే తత్వం రిషబ్ లో కనిపించింది అని అన్నారు. అయితే చాలా సందర్భాల్లో ప్రత్యర్ధి కంటే ముందు ఉన్నాడు అని, జట్టును నడిపించేందుకు తనదైన దారులు వెతికాడు అని పొగడ్తల వర్షం కురిపించారు. అయితే అతడు భవిష్యత్తు సారదుల్లో ఒకరు అని, అందులో సందేహమే లేదు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతిభకి అవకాశం వచ్చినప్పుడు కావాల్సిన టెంపర్మెంట్ అతడు లో ఉందని కొనియాడారు. అయితే సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.