ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత దక్కడం సిగ్గుపడాల్సిన అంశం – స్మిత్

Wednesday, January 13th, 2021, 09:33:40 AM IST

ఆసీస్ టూర్ లో ఉన్న భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మూడవ టెస్ట్ మ్యాచ్ లో నిలకడగా ఆడి మ్యాచ్ ను డ్రా గా ముగించింది. అయితే ఇది ఇన్నింగ్స్ విజయం కంటే కూడా గొప్ప మ్యాచ్ అని పలువురు టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మరి కొందరు టీమ్ ఇండియా అద్భుత జట్టు అంటూ కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మాత్రమే కాకుండా, స్మిత్ పరువును మరొకసారి తీసేసింది. పంత్ గార్డ్ మార్క్ ను స్మిత్ కావాలనే చెరిపి వేశాడు అంటూ వరుస విమర్శలు వస్తున్న తరుణం లో స్మిత్ స్పందించాడు.

తాజా ఆరోపణల తో నిర్ఘాంత పోయా అని, చాలా నిరాశ చెందినట్లు తెలిపారు. పిచ్ వద్దకు వెళ్ళి బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు అని, బ్యాట్స్ మన్ ఎలా ఆడుతున్నారు అని మది లో ఊహించుకుంటా అని, అంతేకాక అప్రయత్నంగా మిడిల్ స్టంప్ కి అనుగుణంగా ఒక మార్కింగ్ కూడా చేసుకోవడం అలవాటు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అది తాను కావాలి అని చేయలేదు అంటూ స్పష్టం చేశారు. అయితే భారత జట్టు అద్భుత ప్రదర్శన కాకుండా, ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత దక్కడం సిగ్గుపడాల్సిన అంశం అని స్మిత్ అన్నాడు.