యువ క్రికెటర్లకు కోహ్లీ రోల్ మోడల్.. శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్..!

Wednesday, June 10th, 2020, 01:59:59 AM IST


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై శ్రేయాస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మాలాంటి ఎంతో మంది యువ క్రికెటర్లకు విరాట్ రోల్ మోడల్ అని చెప్పుకొచ్చాడు.

అయితే జట్టులో విరాట్ సింహంలాంటోడని, ఆడే ప్రతి మ్యాచ్ మొదటి మ్యాచ్ లాగే ఫీల్ అవుతాడని, అసలు అలసిపోడని, సింహం లాగా బలంగా కనిపిస్తాడని అన్నాడు. ఇకపోతే టీమిండియాలో ఫోర్త్ డౌన్ తనదే అనుకుంటున్నానని, ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తాను ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నట్టే అని ధీమా వ్యక్తం చేశాడు.