వివో తప్పుకోవడం ఆర్ధిక నష్ఠంగా భావించడం లేదు – గంగూలీ

Sunday, August 9th, 2020, 07:30:56 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపియల్ షెడ్యూల్ వచ్చేసింది. అయితే ఐపియల్ టైటిల్ స్పాన్సర్ అయిన వివో ఈ ఏడాది స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంది. అయితే భారత్ చైనా మద్య ఏర్పడ్డ ఘర్షణ వాతావరణం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వివో తప్పుకోవడం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వివో తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్ధిక నష్టాల్లోకి జరుకొలేదు అని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే ఇది తాత్కాలిక సమస్య అని, ఇపుడు చేయాల్సింది కాస్త దైర్యంగా ముందుకు సాగిపోవదం అంటూ సౌరవ్ గంగూలీ అన్నారు. గొప్ప గొప్ప విశేషాలు, కార్యక్రమాలు ఒక్క రోజులో జరిగిపోవు, ఒక్క రోజులో వెళ్లిపోవు అంటూ గంగూలీ అన్నారు. అయితే బీసీసీఐ బలమైన బోర్డు అని, గతం లో ఉన్న పాలకులు అయితేనే కానీ, ఆటగాళ్ళు కానీ బీసీసీఐ ను బలంగా నిర్మించారు అని, ఇలాంటి తాత్కాలిక సమస్య లను హ్యాండిల్ చేయగలదు బీసీసీఐ అంటూ గంగూలీ అన్నారు.