కోహ్లీ పై అనుమానాలు ఉంటే అతని రికార్డులు తెలుసుకోవాలి – షోయబ్ అక్తర్

Friday, September 4th, 2020, 01:46:44 AM IST


క్రికెట్ చరిత్రలో ఒక్కొక్క ఆటగాడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అదే తరహాలో టీమ్ ఇండియా కెప్టెన్, బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ పై ఇతర దేశాల కి చెందిన ఆటగాళ్ళు కూడా ప్రశంసలు కురిపిస్తూ నే ఉన్నారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ పై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అది కొందరికి నచ్చలేదు. విరాట్ కోహ్లీ భారత దేశానికి చెందిన వాడు కావడం తో ప్రశంసిస్తుంటే అతని పై విమర్శలు చేస్తున్నారు అని షోయబ్ అక్తర్ తెలిపారు.

విరాట్ కోహ్లీ ను ప్రశంసిస్తుంటే తప్పేంటి అని నిలదీశారు. విరాట్ కోహ్లీ ను ప్రపంచ స్థాయి ఆటగాడి గా గుర్తించా లి అని సూచించారు. కోహ్లీ పై అనుమానాలు ఉంటే అతని రికార్డులు తెలుసుకోవాలి అని హితవు పలికారు. కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఉన్నారా?కనీసం అతనికి దగ్గరగా ఉన్న ఏ ఆటగాడి పేరు అయిన చెప్పండి అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీ లో సాధించాడు అని, ఇపుడు ఉన్న ఆటగాళ్లలో ఇన్ని సెంచరీ లు చేసిన వారు లేరు అని స్పష్టం చేశారు.