ఇదీ భారత్ అంటే…క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు..!

Friday, January 22nd, 2021, 09:31:06 AM IST

మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరచూ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్ లలో ఘనంగా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ అన్ని ఫార్మాట్ లలో టీమిండియా పేసర్ నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. అయితే తన నివాసం వద్దకు చేరుకున్న సమయం లో అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు.

డప్పుల తో, పూల మాలలతో నటరాజన్ కి దక్కిన గౌరవం ను వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడారు. ఇది భారత్ అని, ఇక్కడ క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు అని, అంతకుమించి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. సలెం జిల్లా లో, చిన్నంపట్టి గ్రామం కి చెందిన స్థానికులు నటరాజన్ కి ఘన స్వాగతం పలికారు అంటూ సెహ్వాగ్ కొనియాడారు. అందుకు సంబంధిచిన వీడియో ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐపిఎల్ లో హైదరాబాద్ తరపున ఆడి, రాణించిన నటరాజన్ ఆసీస్ టూర్ లో అన్ని ఫార్మాట్ లలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు.