సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి : కేంద్రం

Wednesday, December 3rd, 2014, 07:07:00 PM IST

saritha
మొన్న జరిగిన 2014 ఆసియా క్రీడలలో రిఫరీ వివాదాస్పద నిర్ణయంతోనే తాను ఓడిపోయానని… అంటూ మెడల్ స్వీకరణ సమయంలో కన్నీళ్ళ పర్యంతం అయిన భారతీయ మహిళా బాక్సర్ సరితాదేవిపై ఐబిఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా… ఆమె క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. కాగ ఇప్పుడు సరితా దేవికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బాక్సర్ సరితా దేవిపై విధించిన నిషేధాన్నిసానుకూల దృక్పదంతో ఆలోచింది సానుభూతితో ఎత్తివేయాలని కోరుతూ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి భారత ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ఆమెపై నిషేధాన్ని ఎత్తివేసి, మళ్లీ ఆమెకు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కౌ వును కోరింది. సరితా దేవి తను చేసిన పనికి క్షమించమని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘాన్ని కోరిందని… నిషేధం విషయమై మరోసారి ఆలోచించాలని భారత ప్రభుత్వం ఐబిఏను కోరింది.