సరితను క్షమించేది లేదు : ఏఐబిఏ

Wednesday, November 12th, 2014, 05:53:36 PM IST


ఇండియన్ బాక్సర్ సరితాదేవిని క్షమించేది లేదని… అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య స్పష్టం చేసింది. ఇటీవల ఆసియా క్రీడలలో సెమీఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయినా సరితాదేవి తనకు మ్యాచ్ రిఫరీలు అన్యాయం చేశారని… రిఫరీల నిర్ణయం కారణంగానే తాను ఓడిపోయానని అంటూ.. పతాకాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఏఐబిఏ బాక్సర్ సరితాదేవిపైన..ఆమె ముగ్గురు కోచ్ లపైన బాక్సింగ్ సమాఖ్య నిరవధిక నిషేధం విధించింది.

అయితే… సరితా తరువాత క్షమించమని కోరిన విషయం తెలిసిందే. కాని, సరితా దేవిని ఎట్టి[పరిస్థితులలోను క్షమించేది లేదని… ఆమెపై నిషేధం అమలు జరుగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది. అయితే.. తుది తీర్పు క్రమశిక్షణ సంఘం వద్ద పెండింగులో ఉన్నదని… త్వరలోనే ఆ తీర్పు వెలువడే అవకాసం ఉన్నట్టు ఏఐబిఏ తెలియజేసింది.