సైనా.. ఆ యాడ్ దేనికోసవమ్మా..!?

Wednesday, April 20th, 2016, 11:52:26 AM IST


సైనా నెహ్వాల్.. దేశం గర్వించదగిన బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒకవైపు తన క్రీడలో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నది. అంతేకాకుండా.. అప్పుడప్పుడు ఫ్యాషన్ షో లో కూడా తళుక్కున మెరుస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే సైనా నెహ్వాల్.. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి ఓ యాడ్ లో నటించింది. ఇక ఆ సమయంలో ఈ అమ్మడు ఇర్ఫాన్ ఖాన్ తో ఫోటో దిగి తన ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసింది. అయితే, ఇర్ఫాన్ ఖాన్ తో చేసిన యాడ్ దేనికోసం అన్నది ఇంతవరకు స్పష్టంగా తెలియదు. ఇర్ఫాన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉన్నదని చెప్పి సైనా ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. ఇక సైనా ట్వీట్ కు ఇర్ఫాన్ ఖాన్ రిప్లయ్ ఇచ్చాడు. సైనా తనను ఉదయం నాలుగు గంటలకు లేచే విధంగా చేసిందని అందులో పేర్కొన్నాడు.