సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్..!

Saturday, March 27th, 2021, 03:40:51 PM IST

భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయాన్ని స్వయంగా సచిన్ టెండూల్కరే ట్విట్టర్ వేదికగా తెలిపాడు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, తన కుటుంబసభ్యులకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా వారికి మాత్రం నెగటివ్ వచ్చినట్టు తెలిపారు.

అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సచిన్ హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బందికి, తనకు మద్దతు తెలిపిన వారన్దరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలోని మొత్తం కేసులలో దాదాపు 60 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని ఈ క్రమంలోనే సచిన్ కరోనా బారిన పడి ఉంటారని తెలుస్తుంది.

sachin tendulkar tested corona positive