కోల్‌కతాపై బెంగుళూరు సింపుల్ విక్టరీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి..!

Thursday, October 22nd, 2020, 12:11:50 AM IST


ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగుళూరు జట్ల మధ్య జరిగిన పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు సింపుల్ విక్టరీ నమోదు చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో బెంగుళూరు జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాను రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ సిరాజ్ కోలుకోలేని దెబ్బ తీశాడు. తన తొలి రెండు ఓవర్లలోనే సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 85 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్లు ఫించ్, పడిక్కల్ మంచి శుభారంభాన్ని ఇవ్వడంతో ఒక వికెట్ కూడా నష్టపోకుండా బెంగుళూరు విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. జట్టు స్కోర్ 46 వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఫించ్ (16) ఔట్ కాగా, ఆ తర్వాత 2 బంతులకు పడిక్కల్ (25) రనౌటయ్యాడు. ఆ తర్వాత గుర్‌కీరట్ సింగ్ 21, విరాట్ కొహ్లీ 18 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.