టీమ్ ఇండియాకు ధైర్యం చెప్పిన రోహిత్

Sunday, October 2nd, 2016, 06:48:35 PM IST

ROHIT
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 316 పరుగల చేయగా రెండవరోజు ఆట మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల అద్భుత ప్రదర్శనతో 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఆదిలోనే తడబడింది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో పడింది.

అలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ చాకచక్యంగా ఆది 132 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో మూడవరోజు ఆట ముగిసేసరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి 339 పరుగుల లీడ్ లో ఉంది. ప్రస్తుతం సలహా 39 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, హెన్రీ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.