బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది – రోహిత్ శర్మ

Thursday, May 6th, 2021, 06:09:55 PM IST


బీసీసీఐ ఈ ఏడాది ఐపియల్ సీజన్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల టీమ్ ఇండియా ఒపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోఐపియల్ టోర్నీ ను రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే దేశం మొత్తం కరోనా తో అతలాకుతలం అవుతున్న సమయంలో ఐపియల్ ద్వారా కాస్త ఉపశమనం కలిగిద్దాం అని భావించాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే బయోబబుల్ సెక్యూర్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం దురదృష్టం అని అన్నారు. అయితే ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకితే ఐపియల్ నిర్వహించడం కష్టతరం అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో లీగ్ ను వాయిదా వేయడం లేదా రద్దు చేయడమే సరైన పని అంటూ చెప్పుకొచ్చారు.

అయితే బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది అని, ఐపియల్ లో ఇంతవరకు మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది అంటూ రోహిత్ శర్మ అన్నారు. అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపియల్ ను నిర్వహిస్తాం అని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే తన తోటి సహచరులతో మాట్లాడిన రోహిత్, మళ్ళీ కలిసే వరకూ ఇంట్లోనే ఉండండి అని చెప్పుకొచ్చారు. ఒక ఫ్యామిలి లా వుండి దేశాన్ని కరోనా సంక్షోభం నుండి తప్పిద్దాం అని అన్నారు. స్టే హోమ్, స్టే సేఫ్ ఫ్రం ముంబై ఇండియన్స్ అని అన్నారు.