ఫన్నీ మూమెంట్: బాల్ వెనుక పరిగెడుతున్న రికీ పాంటింగ్!

Sunday, February 9th, 2020, 03:05:27 PM IST

బుష్ ఫైర్ బాధితుల కోసం రికి పాంటింగ్ ఎలెవన్ మరియు గిల్ క్రిస్ట్ ఎలెవన్ జట్ల మధ్య బిగ్ బుష్ ఫైర్ మ్యాచ్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో జరిగిన కొన్ని అరుదైన సరదా సంఘటనలు అభిమానులని అలరించాయి. వాల్ష్ వేసిన బాల్ పాంటింగ్ పక్క నుండి వెళ్లడం తో రికి పాంటింగ్ అతని వెనకాలే పరిగెత్తాడు. కామెంటేటర్స్ ఇది కంపెటేటివ్ గేమ్ కాదన్నప్పటికీ రికీ మాత్రం నేను ఆడితే ఏదైనా కంపెటేటివ్ అని అన్నారు. ఈ సరదా మూమెంట్ పట్ల అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అయిన ఎలిస్ పెర్రీ సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ వేసింది. సచిన్ కి బౌలింగ్ చేయాలంటే ఎంతో కష్టమని,అంతేకాకుండా ఇలా చేయడం వలన ఎక్కువ విరాళాలు వచ్చే అవకాశం ఉందని తెలపడం తో సచిన్ ఆమె బౌలింగ్ లో క్రికెట్ ఆడాడు. ఇదే మ్యాచ్ లో బ్రియాన్ లారా ఆడిన షాట్ పట్ల సచిన్ ప్రశంసలు కురిపించారు. గిల్క్రిస్ట్ ఆడిన సిక్స్ షాట్ అభిమానులకి మరొకసారి పథ జ్ఞాపకాలని గుర్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో పాంటింగ్ ఎలెవన్ 1 పరుగు తేడాతో గిల్క్రిస్ట్ ఎలెవన్ ని ఓడించింది.