ఐపీఎల్-2021: జట్ల వారిగా వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!

Wednesday, January 20th, 2021, 10:18:48 PM IST


ఐపీఎల్-2021కి సంబంధించి బీసీసీఐ సన్నాహాల మొదలుపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ఫిబ్రవరి నెలలో వేలం జరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే జనవరి 21 లోపు అన్ని జట్లు తమ జట్లలో నుంచి రీలిజ్ చేయాల్పిన ఆటగాళ్ళ జాబితాను ఇవ్వాలని బీసీసీఐ అన్ని ప్రాంచైజీలను కోరింది. దీంతో అన్ని జట్లు తమ జట్టు నుంచి విడుదల చేయాల్పిన ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసి బీసీసీఐకి అందచేసింది.

జట్ల వారీగా వదులుకున్న ఆటగాళ్ల జాబితా:

ముంబై ఇండియన్స్: లసిత్ మలింగ, ప్యాటిన్సన్, మెక్లెనగన్, కౌల్టర్‌నీల్, రూథర్‌ఫర్డ్,

చెన్నై సూపర్ కింగ్స్: హర్బజన్ సింగ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదావ్, షేన్ వాట్సన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: క్రిస్ మోరీస్, మొయిన్ అలీ, అరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, ఉడానా, శివమ్ దూబె

రాజస్థాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఒషానె థామస్, ఆకాశ్ సింగ్, వరున్ అరోన్, టామ్ కరన్

సన్ రైజర్స్ హైదరాబాద్: బిల్లీ స్టాన్లేక్, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్, ఫాబియన్ అలెన్

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్:మ్యాక్స్‌వెల్, కాట్రెల్, ముజీబ్ రెహ్మాన్, నీషమ్, కరుణ్ నాయర్

కోల్‌కత్తా నైడ్ రైడర్స్: క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్, సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, సిద్దేష్ లాడ్

ఢిల్లీ క్యాపిటల్స్: జేసన్ రాయ్, అలెక్స్ కారే, కీమో పాల్, సందీప్ లామిచానే, తుషార్ దేశ్ పాండే, మోహిత్ శర్మ