ఐపియల్: హైదరాబాద్ కి 164 టార్గెట్ సెట్ చేసిన బెంగుళూరు

Monday, September 21st, 2020, 10:14:55 PM IST


ఐపియల్ హడావుడి మొదలై నేటికీ మూడు రోజులు. నేడు సన్ రైజర్స్ హైదరాబాద మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉండగా, బెంగళూరు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగింది. అయితే నిర్ణీత 20 ఓవర్ లలో టీమ్ 163 పరుగులకు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దేవదత్ పదిక్కల్ 56 మరియు ఆరోన్ ఫించ్ 29 పరుగులతో మంచి శుభారంభం ఇచ్చారు. అయితే కోహ్లీ ఈ మ్యాచ్ లో అభిమానులను నిరాశ పరిచారు. అయితే ఎబి డివిలియర్స్ 51 పరుగులు చేసి బెంగుళూరు ను ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఓవరాల్ గా 163 పరుగులతో పర్వాలేదు అనిపించిన కోహ్లీ సేన సన్ రైజర్స్ ను ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందో చూడాలి.