ముంబైకి భారీ టార్గెట్ ఇచ్చిన ఆర్సీబి… ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు హాఫ్ సెంచరీ లు!

Monday, September 28th, 2020, 09:51:33 PM IST


టాస్ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటగా బ్యాటింగ్ కి దిగింది. అయితే ఈ మ్యాచ్ ను గెలవాలి అన్న కసితో భారీ స్కోర్ ను చేయడం జరిగింది. 20 ఓవర్ లలో మూడు వికెట్ల ను కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (52) మరియు పడిక్కల్ (54) అర్ద సెంచరీ లు చేయడం భారీ స్కోర్ కి కారణం అయింది అని చెప్పాలి. అయితే తొలి వికెట్ కు 81 పరుగులు పార్టనర్ షిప్ ఉండటం, ఆ తర్వాత కోహ్లీ వెంటనే వెను తిరగడం జరిగింది.

అయితే డివిలియర్స్ చివర్లో వచ్చినా, అర్ద సెంచరీ (55) కొట్టడం తో స్కోర్ మరింత వేగం గా 200 క్రాస్ అయింది. అంతేకాక డివిలియర్స్ కి తోడుగా శివం దుబె (27) రాణించడం తో ముంబై కి భారీ టార్గెట్ ను ఇవ్వడం జరిగింది. భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన ముంబై తన సత్తా ను చాటుతుందో లేదో చూడాలి.