ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్..!

Wednesday, October 21st, 2020, 09:24:39 PM IST


ఐపీఎల్‌లో నేడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు పోటీ పడుతుండగా, తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ చుక్కలు చూపించాడు. తన ఫేస్ బౌలింగ్‌తో మొదటి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ హైదరాబాదీ బౌలర్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఒక పరుగు ఇవ్వాడనికి ముందు 3 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కూడా సిరాజ్ నిలిచాడు. అంతేకాదు తన మొత్తం నాలుగు ఓవర్ల స్పెల్‌లో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 8 పరుగులే ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ఇవాళ అత్యల్ఫ స్కోర్ 17/4 ను కోల్‌కత్తా చేసింది. అయితే మొత్తం 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.