ఫుల్‌గా డీలాపడ్డ ధోనీ సేన.. రాజస్థాన్ రాయల్స్ సునాయస విజయం..!

Monday, October 19th, 2020, 11:33:08 PM IST


ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు త్వరగా ఒటయ్యారు. ధోనీ 28 పరుగులు, జడేజా 35 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేకపోయారు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఆదిలో తడబడింది. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే జోస్‌ బట్లర్‌ 70 పరుగులు నాటౌట్, స్మిత్‌ 26 పరుగులతో రాణించడంతో 17.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అయితే చెన్నై జట్టు ఆటతీరు మునుపటిలా లేదంటూ, డీలా పడిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.