ఐపియల్: చెన్నై పై 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం!

Tuesday, September 22nd, 2020, 11:54:49 PM IST

చెన్నయ్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు ను సాధించింది. సంజూ శాంసన్ 74 పరుగులతో, స్టీవ్ స్మిత్ 69 పరుగులతో చెన్నయ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్ల లో ఏడు వికెట్ లను కోల్పోయి 216 పరుగుల భారీ స్కోరు చేయడం జరిగింది.

భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు అని చెప్పాలి. మురళి విజయ్ 21, షేన్ వాట్సన్ 33 పరుగులు చేయగా, దుప్లిసేస్ 72 పరుగుల తో రాజస్థాన్ రాయల్స్ కి చుక్కలు చూపించారు. అయితే భారీ స్కోర్ ను చేదించే క్రమం లో కీలక వికెట్లు కోల్పోవడం తో ధోని 29 పరుగులు సైతం వృధా అయ్యాయి. 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చెన్నై పై విజయం సాధించింది.