మూడో వన్డేలో శతకంతో అదరగొట్టిన కేఎల్ రాహుల్!

Tuesday, February 11th, 2020, 11:23:51 AM IST


మొదటి రెండు మ్యాచుల్లో ఓటమిని మూటగట్టుకున్న టీం ఇండియా, మూడో వన్డేల్లో దూకుడు ని ప్రదర్శిస్తుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీం ఇండియా బాట్స్మెన్ ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అయితే వరుస వికెట్లు పడుతున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ టీం ఇండియా ని ఆదుకున్నాడు. తన కెరీర్ లో 9 వ అర్ద శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 16 మ్యాచ్ లు ఆడిన శ్రేయాస్ అయ్యర్ అతి తక్కువ సమయంలో అర్ద శతకం చేసి రికార్డు ని నెలకొల్పాడు. అయితే 63 పరుగులు చేసిన అయ్యర్, ఆ తరువాత రాహుల్, మనీష్ పాండే లతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రాహుల్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ నమోదు చేసాడు. ఆ తరువాత 112 పరుగుల వద్ద జిమ్మీ నీషం బౌలింగ్ లో రాహుల్ అవుట్ అయ్యాడు.

టీం ఇండియా మిడిలార్డర్ ఆదుకోవడం తో భారత్ 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. క్లీన్ స్వీప్ చేయాలనీ న్యూజిలాండ్ ఆశిస్తుంటే, భారత్ ఈ ఒక్క మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. మరి న్యూజిలాండ్ భారత్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.