పంజాబ్ హ్యాట్రిక్ విక్టరీ.. ధావన్ సెంచరీ వృధా..!

Wednesday, October 21st, 2020, 01:13:45 AM IST


ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించింది. దీంతో పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో శిఖర్ ధావన్ 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పృథ్వీషా 7 పరుగులు, పంత్‌ 14, శ్రేయస్‌ 14, స్టోయినిస్ 9 స్వల్ఫ పరుగులే చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది.

అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ 15 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వరుస బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన క్రిస్ గేల్ ఔటవ్వడం, వెంటనే మయాంక్ కూడా రనౌట్ అవ్వడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇక నికోలస్ పూరన్ ధాటిగా ఆడి 53 పరుగులు చేయడం, మ్యాక్స్‌వెల్ కూడా అతడికి సహకరించడంతో వీరిద్దరు ఔట్ అయిన చివర్లో దీపక్ హుడా, జేమ్స్ నీషమ్ కలిసి మ్యాచ్‌ని ఫినీష్ చేశారు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి పంజాబ్ విజయం సాధించింది.