ఐపీఎల్ ని ఎలాగైనా అడ్డుకుంటాం – మద్రాస్ హైకోర్టులో పిటిషన్

Wednesday, March 11th, 2020, 10:43:50 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు కరోనా వైరస్ దారుణంగా పెరిగిపోతున్న తరుణంలో, ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఐపీఎల్ నిర్వహించకూడదని, ఎలాగైనా సరే ఐపీఎల్ ని అడ్డుకోవాలని కోరుతూ చెన్నై కి చెందిన న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 29 నుండి ఈ ఐపీఎల్ ప్రారంభమవనున్నాయి. కాగా ఐపీఎల్ చూడటానికి వచ్చే ప్రేక్షకుల వలన ఈ కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తుందని, అందుకనే ఐపీఎల్ ఇప్పుడు నిర్వహించొద్దని పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే, నరుల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ మహమ్మారి భారీ నుండి కాపాడటానికి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఇలాంటి తరుణంలో ఈ ఐపీఎల్ నిర్వహించడం సరికాదని కోరుకున్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకి కేంద్రం అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ న్యాయవాది జి. అలెక్స్ బెంజిగర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.