భారత క్రికెట్ ను ధోనీ అత్యున్నత శిఖరాలకు చేర్చాడు – అఫ్రిదీ

Tuesday, October 13th, 2020, 01:13:00 AM IST


టీమ్ ఇండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై, అతని కుటుంబ సభ్యుల పై సోషల్ మీడియా వేదిక గా పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు వ్యక్తులు ధోనీ పై, అతని కూతురు పై దారుణ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ధోనీ పై వస్తున్నటువంటీ బెదిరింపుల పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ స్పందించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ధోనీ మరియు అతని కుటుంబం పై ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయో నాకు తెలీదు కానీ, అలా చేయడం సరికాదు అని, అలా జరగక కూడదు అని అఫ్రిదీ చెప్పుకొచ్చారు. భారత క్రికెట్ ను ధోనీ అత్యున్నత శిఖరాలకు చేర్చాడు అని, ఎంతో మంది జూనియర్ మరియు సీనియర్ ఆటగాళ్లను తన ప్రయాణం లో తీసుకెళ్ళాడు అని, అలాంటి వ్యక్తి పై బెదిరింపు లకు పాల్పడటం కరెక్ట్ కాదు అని తెలిపారు. అయితే ఐపియల్ లో చెన్నై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడం, ధోనీ ఫినిషర్ గా కూడా అలరించలేకపోవడం ఈ బెదిరింపులకు కారణం అని తెలిసిందే.